Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తనీష్‌కు ధీటుగా చంద్రబాబును కలిసిన కౌషల్...ఆయన ఏం చెప్పారంటే

Advertiesment
తనీష్‌కు ధీటుగా చంద్రబాబును కలిసిన కౌషల్...ఆయన ఏం చెప్పారంటే
, బుధవారం, 13 మార్చి 2019 (10:34 IST)
కౌషల్ ఆర్మీ అండతో టైటిల్ కొట్టిన తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ తాజాగా ఆర్మీ మొత్తం కౌషల్‌కు ఎదురు తిరిగి ఆరోపణలు, వీడియోలు చేయడం మొదలుపెట్టింది. కౌషల్ కూడా వారికి ధీటుగా సమాధానమిస్తూ బిగ్ బాస్ సభ్యుడు తనీష్ గురించి వ్యాఖ్యలు, ఫోటోలు పోస్ట్ చేసి ఆయనను రచ్చలోకి లాగాడు. 
 
ఇక వివాదం మరింత పెరిగి పరస్పరం ఆరోపణలతో మీడియా ముందుకు వస్తున్నారు. ఇటీవల తనీష్ మెగాస్టార్‌ను కలిసి ఆ ఫోటోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయగా ఈ విషయంగా సహాయం కోరడం కోసమే తనీష్ ఆయనను కలిసినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక కౌషల్ అయితే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవడం చర్చనీయాంశమైంది.
 
అయితే, ఈ భేటీ వెనుకవున్న కారణం ఇంకా తెలియలేదు. ఈ వివాదం కోసమే సీఎంను కలిసారా లేక రాజకీయపరంగా ఈ మీటింగ్ జరిగిందా అనే విషయం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఒకవేళ కౌషల్ ఆర్మీ నిధుల దుర్వినియోగం వివాదానికి సంబంధించి కౌషల్ కలిసినట్లయితే దీనికి రాజకీయ రంగు కొత్తగా తోడైనట్లు అవుతుంది. 
 
మీడియా వస్తున్న వార్తల ప్రకారం, కౌషల్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో విశాఖపట్నం నుండి పోటీ చేయాలని కౌషల్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకోసమే సీఎం కలిసినట్లు రూమర్లు వస్తున్నాయి. నిజమేంటో తెలియాలంటే కౌషల్ నోరు విప్పాలి మరి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనిల్ అంబానీకి పేపర్ ప్లేన్‌ను కూడా తయారుచేయడం చేతరాదు : రాహుల్