Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానంతో ఇనుపరాడ్‌తో బాది చంపేశాడు...

Telangana
Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (16:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రామగుండంలో అనుమానంతో భార్యను ఇనుపరాడ్‌తో కొట్టి చంపేశాడో కసాయి భర్త. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామగుండం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూపీకే రామయ్యకాలనీలో రాములు ఆటో నడుపుకుంటూ భార్య రమాదేవి(30), కూతురు అనూషతో కలిసి జీవిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆమెను అనుమానిస్తూ శారీరకంగా హింసకు గురిచేస్తున్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన రాములు భార్యతో గొడవపడి ఇంట్లో ఉన్న ఇనుపరాడ్‌తో తలపై కొట్టి గాయపరిచాడు. ఇంట్లో నుంచి కేకలు వినపడటంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా గాయపడి ఉండటాన్ని చూశాడు. 
 
దీంతో భయపడిపోయిన రాములు అక్క గాయపడిన రమాదేవి తలకు గుడ్డ ముక్కను అదిమిపట్టి గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి సోదరుడు దేదావత్‌ లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ ఎస్సై శంకరయ్య కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments