Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుళ్లిపోయిన కోడి గుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రులపాలు చేస్తారా?

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (10:39 IST)
కుళ్లిపోయిన కోడి గుడ్లను పెట్టి విద్యార్థులను ఆసుపత్రిపాలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, ప్రతి విద్యార్థికి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద వేల కోట్ల రూపాయల నిధులను అందిస్తుంటే, మీరు కుళ్లిపోయిన కోడిగుడ్లను విద్యార్థులకు పెడుతున్నారని విమర్శించారు. 
 
 
విద్యార్థుల‌కు పౌష్టికాహారం అందించి, వారు చ‌దువులో రాణించేందుకు కేంద్రం మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని సోము వీర్రాజు చెప్పారు. కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై, కుళ్లిపోయిన గుడ్లతో వంట వండే వారిపై చర్యలు తీసుకుని మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సీఎం జగన్ ను కోరుతున్నానని చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ కు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగలేఖ రాశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments