Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సి.పీ.ఎస్ ర‌ద్దు వారం రోజుల్లో చేద్దామన్న అసమర్థ ముఖ్యమంత్రి ఎక్కడ?

సి.పీ.ఎస్ ర‌ద్దు వారం రోజుల్లో చేద్దామన్న అసమర్థ ముఖ్యమంత్రి ఎక్కడ?
విజ‌య‌వాడ‌ , గురువారం, 16 డిశెంబరు 2021 (17:12 IST)
వారం రోజులలో సి.పి.ఎస్ విధానాన్ని పూర్తి చేద్దామని దొంగ ప్రకటనలతో అధికారంలోకి వచ్చి 30 నెల‌లు  పూర్తయినా ఆ ప‌ని చేయ‌లేని అస‌మ‌ర్ధ ముఖ్య‌మంత్రి ఎక్క‌డ అని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప‌రామ‌ర్శించారు. నందిగామలో ఎన్జీవోల నిర‌స‌న‌లో ఆమె పాలుపంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ 1650 కోట్ల రూపాయలు ఎక్కడ? అని ఆమె ప్ర‌శ్నించారు. 
 
 
పీఆర్సీ ఫిట్మెంట్ రేటును 50% వెంటనే చెల్లించాల‌ని, ఇప్పటి వరకు బకాయి ఏడు డిఎలను ప్రభుత్వ ఉద్యోగస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేద‌ని ఆమె నిల‌దీశారు. ఎపిజిఎల్ఐ నిధులను ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేద‌ని ప్ర‌శ్నించారు.
 
 
ఇది కాదా మాట తప్పటం మడమ తిప్పడం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటూ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గ‌ద్దించారు. తాడేపల్లి రాజాప్రసాదాలను వీడి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై జగన్మోహన్రెడ్డి తన వైఖరి ఏమిటో తెలియజేయాల‌ని ఆమె డిమాండు చేశారు. పెండింగ్ 7 డిఎలు, ప్రావిడెంట్ ఫండ్ 1650 కోట్ల రూపాయలు చెల్లించాలి, పే ఫిక్సేషన్ రేట్ 50% ఇవ్వాలి, ఎపిజిఎలై ఏడాదిన్నర బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే చెల్లించాల‌ని డిమాండు చేశారు. 
 
 
నందిగామ పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట గురువారం ఉదయం ఉద్యోగ సంఘాల జేఏసీ వారు పెండింగ్ 7 డిఎలు, ప్రావిడెంట్ ఫండ్ 1650 కోట్ల రూపాయలు చెల్లించాలని, పే ఫిక్సేషన్ రేట్ 50% ఇవ్వాలని, ఎపిజిఎలై ఏడాదిన్నర బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే చెల్లించాలని చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రిలీజ్