Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీచర్ అవతారమెత్తిన విజ‌య‌వాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్

Advertiesment
vijayawada sub collector praveen chand
విజ‌య‌వాడ‌ , బుధవారం, 15 డిశెంబరు 2021 (11:55 IST)
విజ‌య‌వాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ చాలా చురుకుగా ఉంటారు. ఆయ‌న నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో ఉంటూ, వారి స‌మ‌స్య‌ల్ని ఓపిక‌గా వింటూ ప‌రిష్కారానికి కృషి చేస్తారు. అలాంటి ప్ర‌వీణ్ చంద్ ఒక్క‌సారిగా టీచ‌ర్ అవ‌తారం ఎత్తారు.
 
 
కృష్ణా జిల్లా నందిగామ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, అక్క‌డి బ్లాక్ బోర్డుపై లెక్క‌లు వేశారు. పుస్తకం చాక్పీస్ పట్టుకొని టీచర్ గా మారిన సబ్ కలెక్టర్ విద్యార్థునులకు క్లాస్ చెప్పారు. ఉపాధ్యాయురాలును కూడా మ్యాథ్స్లో మీన్ అంటే ఏమిటో అడిగారు. ఆమె చెప్పలేకపోయినా, విద్యార్థినులకు అర్థమయ్యేలాగా మ్యాథ్స్లో మీన్ అంటే అర్థం ఏమిటో వివరించి క్లాస్ చెప్పారు సబ్ కలెక్టర్.
 
 
ఈ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు నాడు, నేడు పనులలో 20 లక్షలకు పైగా సాంక్షన్ అయితే డ్రైనేజీ కూడా సరిగ్గా నిర్మించలేదని సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ ఏఈ, ప్రిన్సిపాల్ పై విచారణకు ఆదేశిస్తామని, ఈ పాఠశాలలో నిర్మాణాలు నాసిరకంగా జరిగితే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ములుగులో ఆర్టీసీ బస్సుకు నిప్పు