Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాంటీన్ల రోజులు... ఖజానాలకు చిల్లులు...

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (18:10 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత రాజకీయాలు, వాటి పరిస్థితి చూస్తూంటే.. ఎందుకో లీడర్ సినిమాలో గొల్లపూడి డైలాగ్ గుర్తొస్తోంది... ప్రత్యేక హోదా కోసం పోరాడిన వాళ్లని పిచ్చివాళ్లుగా జమకట్టి దానికంటే ప్రత్యేక ప్యాకేజీలే ముద్దంటూ... తిట్టిపోసేస్తూ... జనాల నోటి దగ్గరకు ఇంత అన్నం ముద్దని చేర్చే రైతన్నల దగ్గర పొలాలను ఇబ్బడి ముబ్బడిగా లాగేసుకొని సెజ్‌లంటూ... రాజధాని నగరాలంటూ... కంపెనీలకీ... రాజధాని నగర ఉద్యోగులకీ కట్టబెట్టేసిన చంద్రన్న దాదాపు వ్యవసాయం అనే పదాన్ని జనం నుండి దూరం చేసేసాడనేది గత నాలుగున్నర సంవత్సరాలుగా జనమెరిగిన సత్యమే. 
 
అయితే... ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతూండడంతో సీన్ మారిపోయింది. నేను సీనియర్‌ని అయినప్పటికీ... ప్రత్యేక హోదా కోసం మోడీగారి దగ్గర గులాంగిరీ చేసానని అయితే చెప్పడం లేదు కానీ... సార్ అన్నాను అంటూ చెప్పుకురావడం నుండి రైతన్నలకు కేంద్రం ఇచ్చే సాయం మాత్రమే కాకుండా తాము వేరేగా ఒక మొత్తాన్ని ఇస్తామని చెప్పేయడం వరకు ఒక ఎత్తయితే... అసలు జనాలకు కష్టపడి పని చేసుకొని సంపాదించుకునే మార్గాలను చూపడంలో విఫలమై... నిరుద్యోగ భృతుల పేరిట ఒక మొత్తాన్ని అందజేయడం కొంత మేరకు సబబే అనిపించినప్పటికీ... ప్రక్క రాష్ట్రాలను చూసి హడావుడిగా మొదలెట్టేసిన అన్న క్యాంటీన్ల పేరిట ప్రజా సొమ్ము దుర్వినియోగం ఎందుకనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. 
 
దీనికి గానూ... ఎవరైనా ఒక వ్యక్తి తిన్న భోజనానికి అతను చెల్లించే మొత్తం పోగా... మిగిలిన సొమ్ముని (అదేదో పార్టీ సొమ్మన్నట్లు) ప్రభుత్వ ఖజానా నుండి అందించేయడం... ఈ రకంగా ఖజానాని ఊడ్చేస్తూ... ఇలా చేయమని ఏ సామాన్యుడు అడిగాడో తెలియదు కానీ... ఏ సామాన్యుడైనా... తినడానికి ప్రభుత్వం యాచిస్తున్నట్లు ఉందనేది కొంత మంది బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
 
అయితే... మధ్య తరగతి సామాన్యుడైనా... పేదవాడైనా... తమ కడుపు నింపుకోవడానికి నాలుగు బియ్యం గింజలు కొనుక్కునే పరిస్థితిని కల్పించమని, దానికి తగిన పనిని అందజేయమని కోరుకుంటాడే కానీ... అధికార పక్షం అందజేసే 5 రూపాయల భోజనాలకీ... ప్రతిపక్షం అందజేసే 1 రూపాయి భోజనానికి యాచకులుగా మారరు అనేది ఎప్పటికి అర్థం చేసుకుంటారో కానీ ఈ రెండు పక్షాలూ కూడా లీడర్ సినిమా గొల్లపూడిని బాగా అనుకరిస్తున్నాయి మరి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments