గోదావరిలో ముగ్గురు యువకులు బలి.. స్నానాలకు వెళ్లి.. గల్లంతయ్యారు.. చివరికి?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (13:16 IST)
గోదావరిలో ముగ్గురు యువకులు బలైపోయారు. ఆ ముగ్గురు యువకులూ స్నానాలకు వెళ్లి గల్లంతయ్యారు. ఈ ముగ్గురు శుక్రవారం గోదావరి నదిలో విగతజీవులుగా తేలారు. యువకుల మృతి వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గ్రామీణ మండలం శెట్టిపేటకు చెందిన కూడిపూడి ప్రేమ్ సాగర్(17), మామిడిశెట్టి బాలవెంకట రమణ(19, ఫణికుమార్(19)) స్నేహితులు. బుధవారం వీరంతా అమలాపురం నుంచి ముమ్మిడివరం మండలం గేదెల్లంక ఉత్తర వాహిణీ పుష్కర రేవు వద్దకు స్నానాలకు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు.
 
అయితే, ఈ ముగ్గురు యువకులు ఎక్కడికి వెళ్లారనే విషయంపై కుటుంబసభ్యులకు సమాచారం లేకపోవడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ తర్వాత గురువారం వారి తల్లిదండ్రులు అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో యువకుల మొబైల్ కాల్ చేయగా ఓ పశువుల కాపరి వాళ్ల పోన్లో మాట్లాడాడు.
 
పుష్కర రేవు వద్ద బైక్‌పై బట్టలు, ఫోన్లు ఉన్నాయని, నదిలో ఓ మృతదేహం తేలియాడుతోందని అతడు చెప్పాడు. ఆ యువకుల మొబైల్ ఫోన్ల సిగ్నళ్లు కూడా అక్కడే గుర్తించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపారు. ఆ తర్వాత పోలీసులు, కుటుంబసభ్యులు సంఘటనా స్థలికి చేరుకుని యువకుల మృతదేహాలను గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments