Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమాటోలు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు.. దారుణ హత్య

Webdunia
గురువారం, 13 జులై 2023 (14:31 IST)
టమాటో ధర ఒక్కసారిగా పెరగడంతో ఓ వ్యాపారి కోటీశ్వరుడు అయ్యాడు. ఏపీ మదనపల్లి సమీపంలోని బోడిమాలతిన్న గ్రామానికి చెందినవారు రాజశేఖర్ రెడ్డి. ఇతను తనకున్న వ్యవసాయ భూమిలో టమాట పండించి మార్కెట్‌లో విక్రయించేవాడు. గత కొన్ని నెలలుగా వ్యవసాయంలో నష్టం వాటిల్లింది. 
 
అయితే ఉన్నట్టుండి.. టమాటా ధర ఒక్కసారిగా పెరగడంతో రాజశేఖర్ రెడ్డికి గత 20 రోజుల్లో రూ.30 లక్షల ఆదాయం వచ్చింది. అలా రాజశేఖర్ రెడ్డి ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం టమాటా వ్యాపారం ముగించుకుని వసూలు చేసిన డబ్బుతో రాజశేఖర్ రెడ్డి బైక్‌పై వచ్చాడు. 
 
ఎవరో దుండగులు అతనిని అడ్డుకున్నారు. అతడిని కాళ్లు, చేతులు కట్టేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ డబ్బు డిమాండ్ చేస్తూ రాజశేఖరరెడ్డిని కొట్టి చిత్రహింసలు పెట్టారు. అతను చెల్లించడానికి నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తులైన వ్యక్తులు రాజశేఖర్ రెడ్డిని కొట్టి చంపారు. 
 
అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేశారు. దారిన వెళ్లేవారు రాజశేఖర్‌రెడ్డి మృతి చెంది ఉండడంతో మదనపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
 
రాజశేఖర్ రెడ్డిని తెలిసిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

డాకు మహారాజ్ ఫ్లాప్ - నిర్మాత నాగ వంశీ పై ట్రోలింగ్

ఇంట్లో నా పరువు కాపాడండి చైతన్య అక్కినేని వేడుకోలు

టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో మార్పు రావాలి : కౌశిక్, విజయ్ రెడ్డి పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments