Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడ్స్ బాధిత రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (13:21 IST)
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే రుణాంధ్రప్రదేశ్‌గా మారిందనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఏపీ మొదటిస్థానంలో నిలిచింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఎయిడ్స్ నివాణ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. 
 
పరాయి స్త్రీలతో శృంగారంలో అనేక మంది పురషులు ఎలాంటి సురక్షిత చర్యలు తీసుకోకుండానే ముఖ్యంగా కండోమ్ ధరించకుండానే పాల్గొంటున్నారు. ఇలాంటి వారిలో అనేక మంది ఎయిడ్స్ బారినపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య 17.08 లక్షలుగా ఉందని ఎయిడ్స్ నివారణ సంస్థ తెలిపింది. 
 
2011 నుంచి 2021 మధ్య కాలంలో 17,18,814 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. నిజానికి గత దశాబ్దకాలంలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతూ స్తుంది. 2011-12 మధ్యకాలంలో 2.4 లక్షల మంది ఎయిడ్స్ బారినపడగా, 2020-21 మధ్యకాలో ఈ సంఖ్య 85268గా ఉంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గత పదేళ్ళ కాలంలో 3,18,814 మందికి ఈ వైరస్ బారినపడినట్టు పేర్కొంది. ముఖ్యంగా, అత్యధిక ఎయిడ్స్ కేసుల జాబితాలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం