Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లూరి జిల్లాలో బస్సుకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

Advertiesment
bus fire
, సోమవారం, 25 ఏప్రియల్ 2022 (09:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్న బస్సును ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. ఆ తర్వాత బస్సుకు నిప్పు అంటించారు. 
 
దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను పాటించకపోవడంతో వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రాన్స్ అధ్యక్షుడుగా మళ్లీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్