Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి పన్ను పెంపుపై సర్కారు షాక్.. ఏప్రిల్ 1 నుంచే..?

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (12:51 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్ను పెంపుపై సర్కారు షాకిచ్చింది. ఆస్తిపన్ను పెంపుపై ఈ ఏడాది నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కరోనా కారణంగా దీని అమలును వాయిదా వేసినట్లు అనుకున్నారు. 
 
కానీ ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా పెంచిన పన్ను ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తుందని నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే పట్టణ స్ధానిక సంస్ధలు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. 
 
దీంతో పన్ను చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు. ఆస్తి పన్ను పెంపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. 
 
వాస్తవానికి పట్టణ స్ధానిక సంస్ధల్లో ఆస్తిపన్ను పెంపుపై ఆర్దిక సంవత్సరం ఆరంభంలోనే డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. వీటి ఆధారంగా ప్రజలు పన్నుల చెల్లింపు పూర్తి చేస్తారు. కానీ ప్రస్తుతం ఆర్దిక సంవత్సరం ఆరంభం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి ఆస్తిపన్నుపెంచినట్లు ఇప్పుడు నోటీసులు జారీ చేయాల్సి రావడంతో ప్రభుత్వం మరో స్పెషల్ నోటీసులు జారీ చేస్తోంది.
 
ఇందులో గతంలో ఆర్ధిక సంవత్సరం ఆరంభంలో జారీ చేసిన నోటీసుల ప్రకారం పన్ను చెల్లించి ఉంటే దాన్ని మినహాయించి మిగిలిన పన్ను చెల్లించేలా ఈ స్పెషల్ నోటీసుల జారీ ప్రారంభించారు. సెప్టెంబర్ చివరి నాటికి ఈ నోటీసుల జారీ పూర్తవుతుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments