Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్‌కు బదులు డబ్బులు..కిలో బియ్యానికి ఎంత?

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (10:12 IST)
రేషన్‌కు బదులు ఏపీలో డబ్బులు ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. ఏపీలో రేషన్‌కార్డుదారులకు నగదు బదిలీని అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. లబ్ధిదారులు రేషన్ బియ్యం వద్దంటే వారికి ఆ మేరకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. 
 
వచ్చే నెల నుంచే దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యోచిస్తోంది. బియ్యానికి బదులుగా డబ్బులు తీసుకునేందుకు అంగీకరించే లబ్ధిదారులకు ప్రతి నెల నగదు చెల్లిస్తారు. మొదట కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఆపై అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు.
 
తొలి దశలో భాగంగా అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. నగదు బదిలీకి సంబంధించి ఎంపిక చేసిన ప్రాంతాల్లోని వలంటీర్ల ద్వారా ఈ నెల 18 నుంచి 22 వరకు అంగీకార పత్రాలు తీసుకుంటారు. 
 
23న వీఆర్వో పరిశీలన, 25న తహసీల్దార్ ఆమోదం తీసుకుంటారు. అయితే, కిలో బియ్యానికి ఎంత చెల్లించాలన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. రూ. 12 నుంచి రూ. 15 మధ్య ఇచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments