Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెల్లెలిపై అన్నయ్య అత్యాచారం.. నిండు గర్భంతో ఆస్పత్రికి వెళ్తే..?

Advertiesment
12 year old
, మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (12:32 IST)
దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. వావివరుసలు, వయోబేధాలు లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఒకే ఇంట్లో కలిసుండే చెల్లిలిపై అన్న అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనానికి దారితీసింది. ఇంకా ఆమె నిండు గర్భవతి కావడంతో మహిళా సంఘాలు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని పట్టుబడుతూ ఆందోళన చేపట్టాయి. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని ఓ ఎస్టీ కాలనీకి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు. గొడవల కారణంగా కొన్నేళ్ల కిందట వారు విడిపోయారు. భార్యా కొడుకుల్ని వదిలేసి వెళ్లిపోయిన ఆ వ్యక్తి మరో వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు.
 
కానీ ఆమెకు మొదటి భర్త ద్వారా ఓ కూతురు, కొడుకు ఉన్నారు. ఐదేళ్లకుపైగా దూరంగా ఉన్న ఈ కుటుంబాలు ఏడాది కిందటే మళ్లీ దగ్గరయ్యాయి. రెండు కుటుంబాల మధ్య సఖ్యత కుదిరి.. అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో మొదటి భార్య పెద్ద కొడుకైన 20 ఏళ్ల యువకుడు వరుసకు చెల్లెలు అయ్యే బాలిక(12)పై కన్నేశాడు. 
 
కలిసి ఒకే ఇంట్లో ఉంటుండటంతో ఎవరూ లేని సమయంలో ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.  
 
చెల్లెలిపై అన్న అత్యాచారం చేస్తున్నాడనే విషయం కుటుంబానికి తెలిసేటప్పటికే బాధితురాలు నాలుగు నెలల గర్భంతో ఉంది. దీంతో గుట్టుచప్పుడుకాకుండా వ్యవహరించారు. కానీ పాపకు తొమ్మిది నెలలు నిండటంతో ప్రసవం కోసం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లక తప్పలేదు. 
 
సోమవారం నాడు నెల్లూరులోని జీజీహెచ్‌కు బాలికను తీసుకురాగా, అనుమానం వచ్చి డాక్టర్లు ప్రశ్నించడంతో ఆమె వయసు 12ఏళ్లేనని వెల్లడైంది. షాకైన డాక్టర్లు ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేగి తుఫాను బీభత్సం - 25 మంది మృతి