ఫిలిప్పీన్స్‌లో మేగి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ బీభత్సం దెబ్బకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపుగా 25 మంది చనిపోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ తుఫాను కారణంగా తూర్పు, దక్షిణ తీరాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మేగి తుఫాను ప్రభావం కారణంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌లో ప్రతి యేడాది కనీసం 20 ఉష్ణ తుఫాన్లు వస్తుంటాయి.
తూర్పు తీరంపై మేగి తుఫాను విరుచుకుపడటంతో సుమారు 13 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. భారీ వర్షాలు, గాలులు వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ వరదల కారణంగా అనేక గృహాలు నీట మునిగాయి. కొండ చరియలు విరిగిపడటం వల్ల అనేక గ్రామాల్లోకి బురదమట్టి వచ్చి చేరింది.