Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పైకప్పు కూలి.. నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరిన ఆ నలుగురు

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (10:04 IST)
నంద్యాల జిల్లా చిన్నవంగలి గ్రామంలో ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. చిన్నవంగలి గ్రామంలో గురు శేఖర్ రెడ్డి (42), అతని భార్య దస్తగిరమ్మ, ఇద్దరు మైనర్ కుమార్తెలు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో మృతి చెందినట్లు ఆళ్లగడ్డ సబ్ డివిజనల్ పోలీసు అధికారి షేక్ షరీఫుద్దీన్ తెలిపారు.
 
ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిద్రలోనే మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. అర్ధరాత్రి పెద్ద చప్పుడు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా కుటుంబ సభ్యులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. 
 
ప్రమాదం జరిగినప్పుడు గురు శేఖర్ రెడ్డి రెండో కుమార్తె విద్యార్థిని కడప జిల్లాలో ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments