ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ సారథ్యంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం అధిక శ్రద్ధ చూపిస్తుంది. తమతమ పార్టీ కార్యాలయాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ వాటిని పరిష్కరిస్తుంది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద అందుబాటులో ఉండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు.
పార్టీ ప్రజా ప్రతినిధులు. తక్షశిల ఐఏఎస్ ఆకాడెమీలో డిగ్రీ చదివిన విద్యార్థిని ఫీజు బకాయిపడింది. ఆ విద్యార్థిని తల్లి తన నిస్సహాయత, ఆర్థిక ఇబ్బందులూ తెలుపుతూ ఆ విద్యా సంస్థతో మాట్లాడి ఫీజు రాయితీ ఇప్పించాలని కోరారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విద్యా సంస్థ డైరెక్టర్ బి.ఎస్.ఎన్.ప్రసాద్‌తో మాట్లాడగా సానుకూలంగా స్పందించారు. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి ఫీజు బకాయి మాఫీ చేస్తానని తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికి 25 శాతం ఫీజు రాయితీ ఇస్తామని ప్రసాద్ హామీ ఇచ్చారు.