Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నంద్యాల జిల్లాలో విషాదం.. మట్టిమిద్దె కూలి నలుగురు మృతి

Advertiesment
deadbdoy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. మట్టిమిద్దె కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఈ ఘటనలో జిల్లాలోని చాగలమర్రి మడలం చిన్నవంగలిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. 
 
ఈ ఘటనలో భార్యాభర్తలు గణశేఖర్ రెడ్డి (45), భార్య దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10)లు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తులంతా కలిసి వెలికి తీశారు. కాగా, ఈ దంపతులకు చెందిన మరో కుమార్తె ప్రొద్దుటూరలో చదువుకుంటుంది. దీంతో ఆ యువతి మాత్రం ప్రాణాలతో బయటపడి అనాథగా మిగిలింది. రాత్రికి రాత్రి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తమ నుంచి భౌతికంగా దూరంకావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యున్నతమైన ఆర్థిక, పెట్టుబడి అవకాశాలను అన్వేషించిన యుఎఇ-ఆంధ్రప్రదేశ్