Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీతో సమావేశమైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (19:17 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం పిలుపు మేరకు మూడు రోజుల క్రితం హస్తినకు వెళ్లిన నల్లారి.. అక్కడే ఉన్నారు.  
 
ఈ పర్యటనలో భాగంగా, ఆయన శుక్రవారం సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆ తర్వాతే ఏపీకి తిరుగు పయనమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సోనియా గాంధీతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగి బయలుదేరారు. 
 
అయితే, ఢిల్లీకి వెళ్లిన తొలి రోజున ఆయన తన వ్యక్తిగత పనుల కోసమే ఇక్కడకు వచ్చినట్టు చెప్పిన నల్లారి.. ఆ తర్వాత ఆయన మీడియాకు కనిపించనేలేదు. అలాగే, సోనియా గాంధీతో భేటీ తర్వాత కూడా ఆయన మీడియాకు ముఖం చాటేశారు. కాగా, సోనియా, కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. 
 
ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెప్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితలతో పాటు 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు తదిత అంశాలపై చర్చినట్టు వినికిడి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments