Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారానికి ఉరే సరి... ఏపీలో కొత్త చట్టం.. పేరు "ఏపీ దిశ"

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (18:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 
 
నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. అత్యాచార కేసుల్లో ఏడు రోజుల్లో పోలీస్‌ దర్యాప్తు పూర్తి చేయాలని, 14 రోజుల్లో కోర్టులో వాదనలు, 21 రోజుల్లో తీర్పు వెల్లడించాలని కేబినెట్ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
 
ఇందుకోసం ఏపీ దిశ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకునిరానుంది. దీంతో పాటుగా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అత్యాచార కేసులకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కేబినెట్ అభిప్రాయపడింది. ప్రత్యేక కోర్టు పరిధిలో యాసిడ్‌ దాడులు, అత్యాచారం కేసులు తేవాలని నిర్ణయించారు. 
 
అదేవిధంగా, సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చిన్నారులను లైంగికంగా వేధిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇక చివరగా, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ... చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
 
అంతేకాకుండా గ్రామ సచివాలయం, వాలంటీర్ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పర్యవేక్షణ కోసం కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం