Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 12 మంది మృతి

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (18:47 IST)
ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,746 శాంపిల్స్‌ పరీక్షించగా.. 864 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. మరో 12 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.
 
చిత్తూరులో నలుగురు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 1,310 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
 
తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,73,63,641కు చేరుకున్నాయి.. ఇక, పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,30,849కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 20,02,187కు చేరుకుంది.
 
మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,010కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,652 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్‌. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో 141, తూర్పు గోదావరి జిల్లాలో 135, కడరపలో 117, ప్రకాశం జిల్లాలో 114, చిత్తూరులో 101 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments