దటీజ్ సీఎం జగన్... అప్పుడే మొదలెట్టేశారుగా...

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (20:26 IST)
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. లోటు బడ్జెట్‌ కారణంగా తానే అందరికి ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నారు. తిరుగులేని మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి హంగుఆర్భాటాలకు పోకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు. అది మాత్రమే కాకుండా ఇక నుండి ప్రభుత్వం తరపున జరిగే ఏ కార్యక్రమానికైనా వీలైనంత వరకు ఖర్చులు తగ్గిస్తానని చెబుతున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకార మహోత్సవాన్ని అత్యంత నిరాడంబరంగా నిర్వహిస్తానని చెప్పిన జగన్ చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పెట్టిన ఖర్చు అక్షరాలా 29 లక్షల పదివేల రూపాయలు. కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ స్థలమైన ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించడం, వీలైనంత వరకు ప్రభుత్వ వనరులను ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చు భారీగా తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. 
 
2014లో టీడీపీ విజయం తర్వాత అప్పటి సీఎంగా ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారు. వాస్తవానికి ప్రభుత్వంలో ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం ఆర్ధిక శాఖలో కీలక అధికారుల నియామకంపై దృష్టి సారిస్తోంది. ఆ లోపు నిర్వహించే ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాన్ని, చివరికి ప్రెస్ మీట్లను సైతం తక్కువ ఖర్చుతోనే నిర్వహించేలా ప్రభుత్వం అంతర్గతంగా ఆదేశాలు ఇస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments