Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా దేవాన్ష్ బర్త్‌డే వేడుకలు : తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం (వీడియో)

టీడీపీ అధినేత, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుడు

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (17:58 IST)
టీడీపీ అధినేత, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకున్నారు. చంద్రబాబు వెంట సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు కూడా ఉన్నారు.
 
దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా శ్రీవారిని దర్శించుకునేందుకు మంగళవారం సాయంత్రమే కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమలకు చేరుకున్న విషయం తెల్సిందే. అనంతరం ఇక్కడి పద్మావతి అతిధిగృహంలో బసచేసి, బుధవారం ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
 
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అలాగే తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబునాయుడు తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.26 లక్షలను విరాళంగా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments