Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముక్కల రాజధానిపై ప్రత్యేక తీర్మానం ఎందుకు చేశారు?

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేస్తూ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసింది. నిజానికి అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టి దాన్ని సంపూర్ణ మెజార్టీతో ఆమోదించింది. అదేసమయంలో ప్రత్యేక తీర్మానం చేయడం జరిగింది. ఇలాంటి తీర్మానం ఎందుకు చేశారన్న అంశంపైనే ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
తాము అనుకున్నట్లుగా, ఎలాంటి ఆలస్యం లేకుండా మూడు రాజధానుల నిర్ణయం అమలయ్యేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే... బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ, దీనికి శాసన మండలిలో చుక్కెదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు భావిస్తోంది. ఎందుకంటే మండలిలో విపక్ష పార్టీలకే పూర్తి బలం ఉంది. 
 
ఇక్కడ బిల్లు వీగిపోతే అపుడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సి వస్తుంది. చట్టసభల్లో బిల్లును ఆమోదించుకోలేక, ఆర్డినెన్స్‌ తేవాల్సి రావడం సర్కారుకు అప్రతిష్టగా భావిస్తారు. మండలిలో ఈ బిల్లు భవిష్యత్తు ఏమవుతుందన్న దానిపై సర్కారుకు సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానులపై ఒక తీర్మానాన్ని ఆమోదించేశారు. మండలిలో బిల్లు అటూఇటు అయినప్పటికీ... అసెంబ్లీ తీర్మానం ఆధారంగా రాజధాని తరలింపును ప్రారంభిస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments