Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అటువంటి మరణమే దేవుడును కోరుకుంటా: మంత్రి కొడాలి నాని

Advertiesment
అటువంటి మరణమే దేవుడును కోరుకుంటా: మంత్రి కొడాలి నాని
, సోమవారం, 20 జనవరి 2020 (20:31 IST)
చంద్రబాబు, లోకేష్‌లపై ఒంటికాల మీద లేచే మంత్రిగా పేరుపడ్డ కొడాలి నాని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో రాజధాని అంశం మీద మాట్లాడిన అనంతరం సోషల్ మీడియాలో వైఎస్ఆర్ మరణించిన తీరు పట్ల అనేక మంది విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మరణం కావాలని దేవుడిని కోరుకుంటానని నాని వ్యాఖ్యానించారు. వైఎస్ చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో నేటికీ బ్రతికే ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మహా నాయకుడు, ప్రజా నాయకుడిగా ప్రజల మన్నలను అందుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రజా జీవితాలను ప్రభావితం చేసిన వ్యక్తులు చనిపోయినా కూడా బతికే ఉండారన్నారు. 
 
తెలుగు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి అంటే ఉన్న అభిమానం. వైఎస్ చేసిన పనుల, ప్రజలకు ఆయన అందించిన పథకాలు మూలంగానే జగన్ నేడు ముఖ్యమంత్రిగా మన ముందు ఉన్నారని అన్నారు. 70 ఏళ్లు వచ్చినా తన కొడుకును గెలిపించుకోలేని చంద్రబాబు కంటే వైఎస్ మరణం వంద శాతం బెటర్ అని వ్యాఖ్యానించారు. రాజధాని మార్పు గురించి ఆందోళన చేస్తున్న రాజధాని రైతులకు, మహిళలకు అనుమానాలుంటే జగన్‌ను వచ్చి కలవాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డిది ఎంతో పెద్ద మనసని, తప్పకుండా మీకు న్యాయ చేస్తారన్నారు కొడాలి నాని.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్యావుడా.. అధినేత వద్దన్నా జగన్‌ని కలిసిన జనసేన ఎమ్మెల్యే, ఎందుకు?