రాజధాని విశాఖకి తరలిస్తే మా సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏమీ లేదు: మంత్రి కొడాలి నాని

సోమవారం, 20 జనవరి 2020 (17:22 IST)
రాజధాని విశాఖకు తరలిస్తే మా సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని అన్నారు మంత్రి కొడాలి నాని. అక్కడున్న డాల్ఫిన్ హోటల్ మాదే, నోవాటెల్ హోటల్ మాదే. గీతమ్స్ విశ్వవిద్యాలయం మాదే అన్నారు. వాహనాల డీలర్లు మావాళ్ళే. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచేది కూడా మావాళ్ళే అన్నారు.
 
ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం, ఉద్యోగాలు చేసుకునే చొరవ మా సామాజిక వర్గానికి ఉంది. మా సామాజిక వర్గానికొచ్చిన నష్టం ఏమీ లేదు. నష్టపోయేదల్లా చంద్రబాబు, ఆయన వల్ల లాభం పొందేవాళ్ళే. 
మా సామాజికవర్గానికి అమరావతితో పాటు విశాఖ కూడా కలవడం మేలు చేకూరుస్తుంది అన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 3 రాజధానులకే మా పార్టీ మద్దతు, అసెంబ్లీలో రాపాక, బల్లలు చరిచిన వైకాపా