Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ శాసనసభ తొలి ఫలితం వెలువడేది ఎపుడంటే...

Webdunia
బుధవారం, 22 మే 2019 (17:08 IST)
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారరం వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు గురువారం (మే 23వ తేదీ) చేపట్టనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 
 
ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పందిస్తూ, ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, మొదట పోస్టల్ బ్యాలెట్స్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు.
 
ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12 గంటలలోపు ట్రెండ్స్ తెలిసిపోతాయన్నారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని, ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు బెల్ ఇంజనీర్లు సిద్ధంగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఓట్ల లెక్కింపులో 25 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద 25 మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రతతో అదనంగా మరో 10 కంపెనీల బలగాలు కూడా వచ్చాయని తెలిపారు. 
 
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా వీవీప్యాట్‌ స్లిప్స్‌ను ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని అనుసరించనున్నట్టు చెప్పారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం రావొచ్చని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. వీవీప్యాట్స్ స్లిప్పుల లెక్కింపు తర్వాత తుది ఫలితం వెల్లడిస్తామని గోపాలకృష్ణ ద్వివేదీ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments