Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజన్న సుపరిపాలన అందిస్తా : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Advertiesment
రాజన్న సుపరిపాలన అందిస్తా : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
, బుధవారం, 22 మే 2019 (08:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుందని అనేక ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చాయి. దీంతో ఆ పార్టీ శ్రేణులు తమ పార్టీ అధినేత జగన్ సీఎం కావడం ఖాయమని నేతలు పదేపదే జోస్యం చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో జగన్ ఓ ఆసక్తికర పోస్టర్‌ను పోస్ట్ చేశారు. రాజన్న సుపరిపాలనను తీసుకురావాలన్నదే తన సంకల్పమని అందులో పేర్కొన్నారు. ఈ పోస్టర్‌లో నవ్వుతూ మైకు పట్టుకుని జగన్ ఉండటం గమనించవచ్చు. 
 
ప్రజాస్వామ్యంలో 'ప్రజాపరిపాలనే సాగాలి' అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ పోస్టర్‌పై మండు టెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారని, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారని, వారి ఆశీస్సులు అందిన వేళ వారికి బాధ్యుడినై ఉంటానని రాశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖమ్మం లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్స్