Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టం లేదు.. పైనుంచి వచ్చిన ఆదేశాలతో ర్యాలీలు - జగన్ ఫోటోలకు పాలాభిషేకం

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (13:55 IST)
రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేయాలని సీఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని, ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించుకున్న విషయం తెల్సిందే. కానీ, ఇదే బిల్లుకు శాసనమండలిలో తెదేపా బ్రేక్ వేసింది. ఈ తాజా పరిణామాలపై విశాఖ జిల్లా వైకాపా నేతలు తమ మనోగతాన్ని వెల్లడించారు. 
 
మూడు రాజధానుల ఏర్పాటు తమ పార్టీలో కొంతమందికి ఇష్టం లేదని, అయినప్పటికీ పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ర్యాలీలు నిర్వహించి, సీఎం జగన్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నామని ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన మరో నేత వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కొన్ని ప్రాంతాలకు అనుకూలంగా, మరికొన్ని ప్రాంతాలకు వ్యతిరేకంగా వుండవచ్చని, కానీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ప్రజాప్రతినిధులకు కూడా ఇవ్వడం లేదని కొద్దిరోజుల క్రితం వైసీపీలో చేరిన నర్సీపట్నం నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, ప్రభుత్వం కూడా తాను తీసుకోబోయే నిర్ణయాలపై పార్టీ నేతల అభిప్రాయాలు, మనోగతాన్ని తెలుసుకోవడంలేదని, ఇది తమ పార్టీతోపాటు ప్రతిపక్షంలోనూ వుందని నిర్వేదంతో చెప్పారు. ఏ పార్టీ వారైనా సరే అధిష్టానం నుంచి వచ్చే ఆదేశాలను పాటించడం, షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం తప్ప వాటిని కాదనే పరిస్థితి లేదని వారు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments