Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా సభ్యులు సహనం కోల్పోయి దాడి చేస్తే : అసెంబ్లీలో సీఎం జగన్

Advertiesment
Amaravati Live
, బుధవారం, 22 జనవరి 2020 (11:52 IST)
సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు పట్టుమని పది మంది కూడా లేరు. కానీ, వారి ప్రవర్తన వీధి రౌడీల కంటే దారుణంగా ఉంది. మా సభ్యులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా సభ్యులు సహనం కోల్పోయి తెదేపా సభ్యులపై దాడి చేస్తే ఆ ఘటనను రాజకీయం చేసి లబ్ది పొందాలని చూస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్నారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, బుధవారం తెదేపా సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సభాపతి పోడియను చుట్టుముట్టారు. ఈ చర్యపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు మొత్తం కలిపి 10 మంది కూడా లేరని, ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 
 
సభాపతిని అగౌరవపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి దాడి చేస్తే.. ఆ ఘటనను రాజకీయం చేసి లబ్ధిపొందే దిక్కుమాలిన పార్టీ టీడీపీ అని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సంస్కారం లేని ఇలాంటి వ్యక్తులు సభకు ఎందుకు వస్తున్నారో? అర్థం కవడంలేదని అన్నారు. 
 
సభ్యులు స్పీకర్‌ పోడియం రింగ్‌ దాటి వస్తే మార్షల్స్‌ ఎత్తుకెళ్లే పరిస్థితి తీసుకురావాలని సభపతికి సూచించారు. టీడీపీ సభ్యులు 10 మంది ఉన్నారు.. వీళ్ల కంటే వీధి రౌడీలు చాల బెటర్‌ అని జగన్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు, అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనివుంది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించివున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేద‌న‌ల మ‌ధ్య వేడుక‌లు వ‌ద్దు .. నారా లోకేశ్