Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా మాంత్రికురాలి హత్య.. ఎక్కడ..?

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (10:52 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని ఏఎస్‌ఆర్ జిల్లా కొయ్యూరులోని బూదరాళ్ల పంచాయతీ పరిధి మహిళా మాంత్రికురాలిని హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. రష్మో (వయస్సు 34) ఆంధ్రప్రదేశ్‌లోని ఏఎస్‌ఆర్ జిల్లా కొయ్యూరులోని బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని మాంత్రికురాలిగా జీవనం సాగించింది. ఆమె ఊరికి దూరంగా ఒక గుడిసెలో నివాసం వుంటోంది. జాతకం, మంత్రవిద్యను తెలుసుకున్న ఆమెను చూసేందుకు చాలామంది వచ్చి వెళ్తుండేవారు.
 
ఈ పరిస్థితిలో గ్రామంలోని ప్రజలకు అకస్మాత్తుగా ఓ మర్మమైన వ్యాధి సోకింది. కొద్దిమంది అనారోగ్యంతో చనిపోయారు. ఆ సమయంలో రష్మో చేతబడి వల్లనే గ్రామంలో వ్యాధి వ్యాపించిందని కొందరు ప్రచారం చేశారు. దీంతో గ్రామంలోని కొందరు రష్మోను చంపితేనే ఊరి నుంచి రోగాలు దూరమవుతాయని నిర్ణయించుకున్నారు. 
 
ఇంతలో, సంఘటన జరిగిన రోజు, రష్మో గుడిసె తగలబడింది. ఆమె ఆ గుడిసెలోనే మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రష్మో మృతదేహాన్నిస్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రష్మోను మహిళలు హత్యచేసినట్లు తెలిసింది. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments