Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయి ఆధీనంలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు విముక్తి

సెల్వి
సోమవారం, 5 ఆగస్టు 2024 (22:54 IST)
ఎట్టకేలకు వైకాపా సీనియర్ నేత విజయసాయిరెడ్డి కుటుంబ ఆధీనం నుంచి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కి విముక్తి లభించింది. 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఏసీఏను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ గద్దె దించడంతో ఆ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేశారు. 
 
వీరి రాజీనామాలను ఏసీఏ సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. విజయవాడలోని ఓ హోటల్‌లో సర్వసభ్య సమావేశం జరిగింది. ఎసిఎ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డితో పాటు మరికొంతమంది రాజీనామాలను సమావేశంలో ఆమోదించారు.
 
అలాగే ఏసీఏ కోసం కొత్త మేనేజ్‌మెంట్ బాడీని సెప్టెంబర్ 8న ఎన్నుకోనున్నారు. కొత్త ఆర్గనైజింగ్ బాడీ ఎన్నిక వరకు ఏసీఏ నిర్వహణ కోసం ముగ్గురు సభ్యుల కమిటీని కేటాయించారు. త్రిసభ్య కమిటీలో ఆర్‌విఎస్‌కె రంగారావు (విజయనగరం), మాంచో ఫెర్రర్ (అనంతపురం), జె.మురళీమోహన్ (గుంటూరు) సభ్యులుగా నియమితులయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments