రూపాయి జీతగాని ఇంటి సొబగులకు రూ.15 కోట్లా?

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (15:24 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నెలకు కేవలం ఒక్కటంటే ఒక్క రూపాయి మాత్రమే వేతనం తీసుకుంటున్నారు. కానీ, ఆయన ఇంటి మరమ్మతుల కోసం కోట్లాది రూపాయల మేరకు ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. తాజాగా మరో 15 కోట్ల వ్యయంతో ఇంటికి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఈ నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. 
 
దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. '‘రూపాయి జీతం మాత్రమే తీసుకొంటున్నానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన ఇంటి సోకులకు ఐదు నెలల్లో రూ.15 కోట్లు ప్రజా ధనం ఖర్చు చేశారు' అని గుర్తుచేశారు. 
 
'భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. విష జ్వరాలతో ప్రజలు చనిపోయినా ఫర్వాలేదు. దోమల నివారణకు ప్రజా ధనం వృథా చేయబోమని వైసీపీ నేతలే సెలవిచ్చారు. మరి ముఖ్యమంత్రి ఇంటి సోకులకు రూ.15 కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పగలరా!' అని లోకేశ్ సూటిగా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments