Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి ఆనందయ్య... బీసీ కోసం రాజకీయ పార్టీ

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (07:43 IST)
నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం మండలానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య సంచలన ప్రకటన చేశారు. బీసీల కోసం కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయన్నారు. అదేసమయంలో బీసీలపై రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం  ఏమాత్రం సరికాదన్నారు. 
 
ఇకపోతే, కరోనా కష్టకాలంలో అనేక మంది రోగుల ప్రాణాలు కాపాడిన ఆనందయ్య.. ఇపుడు థర్డ్ వేవ్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మూడో దశ ఉత్పన్నమైనప్పటికీ దానికి సరైన మందు తన వద్ద ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మాత్ర ఆ మందును ప్రజలందరికీ పంపిణీ చేస్తానని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments