Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఒడి డబ్బులు స్వాహా చేసిన వాలంటీర్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (19:10 IST)
ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సచివాలయం పరిధిలో ఓ వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే నిధులను స్వాహా చేశాడు. మహిళను బురిడీ కొట్టించి ఈ నిధులను తన జేబులో వేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఏపీలోని వాలంటీర్లు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ గ్రామంలో పని చేసే ఖాసీం పీరా అనే వాలంటీర్ అమ్మ ఒడి నిధులతో పత్తా లేకుండా వెళ్లిపోయాడు. బాధిత మహిళ వెల్లడించిన వివరాల మేరరకు.. 
 
నాగినేని గుంట గ్రామానికి చెందిన హుసేన్ బీ వద్ద వేలిముద్ర వేయించుకున్న వాలంటీర్ అమ్మ ఒడి నగదును తీసుకుని పారిపోయాడు. ఈ పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో రూ.10 వేలు గత నెల 7వ తేదీన డ్రా చేసినట్టు బ్యాంకు అధికారులు ఆమెకు చెప్పడంతో ఖంగుతిన్నారు. వెంటనే ఆమె వాలంటీర్‌ను ప్రశ్నించగా ఒకదానికొకటి పొంతనలేని సమాధానం ఇచ్చాడు. పైగా ఇదిగో ఇస్తాను.. అదిగో ఇస్తాను అంటూ మభ్యపెట్టసాగాడు. దీంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, మీడియాకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments