Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా అబద్ధాలకోరు... 9 పేజీల్లోనూ అబద్ధాలే... చంద్రబాబు ధ్వజం

భాజపా అధ్యక్షుడు అమిత్ షా తాజాగా లెక్కలు చూపిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా అన్ని లెక్కలు చూపిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చినదీ, వెల్

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (17:38 IST)
భాజపా అధ్యక్షుడు అమిత్ షా తాజాగా లెక్కలు చూపిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా అన్ని లెక్కలు చూపిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చినదీ, వెల్లడించారు. ఐతే అమిత్ షా 9 పేజీల లేఖలో ప్రస్తావించిన గణాంకాలన్నీ అబద్ధాలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. 
 
అసెంబ్లీ సమావేశాల్లో బాబు మాట్లాడుతూ... కొన్ని అంశాల‌ను వ‌క్రీక‌రిస్తూ లేఖ‌లో పేర్కొన్నార‌నీ, ఇలా అస‌త్యాలు ఎందుకు చెబుతున్నార‌ని, ఉన్న‌త స్థాయిలో ఉన్న వ్య‌క్తులకు ఇలాంటి తీరులో ప్రవర్తించడం ఆశ్చర్యకరంగా వుందన్నారు. అమిత్ షా రాసిన లెక్కలకీ కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులకు పొంతనే లేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ రాష్ట్రం వద్ద వుంటాయని తెలిసి కూడా ఇలాంటి అవాస్తవాలను లేఖలో ఎందుకు రాశారని ప్రశ్నించారు.
 
హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అయితే ఆ పార్టీకి మద్దతునిచ్చింది భాజపా అన్నారు. అలాంటప్పుడు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత భాజపా పైన లేదా అని నిలదీశారు. రాష్ట్రానికి న్యాయం చేస్తారేమోనని చివరి వరకూ వేచి చూసామనీ, ఐతే కేంద్రం మొండి చెయ్యి చూపించడంతో ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments