Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో మ‌హాపాద యాత్ర‌కు బ్రేక్! రాజధాని రైతులకు సోమిరెడ్డి పలకరింపు

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (11:34 IST)
భారీ వర్షాల కార‌ణంగా అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌ పాద యాత్రకు బ్రేక్ ప‌డింది. రాజ‌ధాని టు తిరుమ‌ల దేవ‌స్థానం యాత్ర‌కు విరామం ప్రకటించి నెల్లూరు నగరంలోని అంబాపురం శాలివాహన ఫంక్షన్ హాలులో విశ్రాంతి తీసుకుంటున్న రైతులను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, త‌దుప‌రి యాత్ర వివ‌రాలు అడిగారు.
 
 
అమరావతికి మద్దతుగా కళాకారులు చేసిన ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల‌ రాజధానిగా అమరావతి కొనసాగాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ‌ని చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. రైతుల త్యాగం వృథా కాబోదని, ప్రజలందరి ఆశీస్సులు, భగవంతుని దీవెనలతో రాజధానిగా అమరావతి కొనసాగుతుందని స్పష్టం చేశారు.


ఇటీవ‌ల కోర్టు తీర్పుల‌కు భ‌య‌ప‌డి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం, మూడు రాజ‌ధాని బిల్లుల‌ను ఉప‌సంహ‌రించుకుంద‌ని, మ‌ళ్ళీ దీనిపై ఏదైనా ప్ర‌య‌త్నం చేస్తే, రాష్ట్ర ప్ర‌జ‌లు ఊరుకోర‌ని అన్నారు. ఈ సారి ఈ ఉద్య‌మం మ‌రింత పెద్ద‌దిగా  మారుతుంద‌ని, ప్ర‌జా ఉద్య‌మంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కొట్టుకుపోతుంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. కతో సక్సెస్‌.. దిల్‌రుబాతో రెడీ

నరేష్‌లో 10 మందికి ఉండే ఎనర్జీ ఉంది.. రాత్రి అయితే తట్టుకోలేకపోతున్నా... : నటి పవిత్ర లోకేశ్ (Video)

నిర్మాత దిల్ రాజు నివాసాల్లో ఐటీ మెరుపుదాడులు

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

తర్వాతి కథనం
Show comments