కానిస్టేబుల్ నుంచి ఏపీపీఎస్సీ ఛైర్మన్ వరకు ఆ కులంవాళ్లే : చీరాల ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (18:40 IST)
తెలుగుదేశం పార్టీ నుంచి నిష్క్రమించిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు చుట్టూత కులపిచ్చి విష వలయం ఉందని ఆరోపించారు. 
 
రెండు రోజుల క్రితం టీడీపీ రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్ తిరిగి వైకాపా గూటికే చేరుకున్నారు. గురువారం అనకాపల్లి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. 
 
ఈ పరిణాంపై ఆమంచి కృష్ణమోహన్ స్పందిస్తూ, చంద్రబాబు చుట్టూ ఉన్న ఈ విషవలయం రాష్ట్రాన్ని పెకిలించి వేస్తోందన్నారు. పరిపాలనా యంత్రాంగంగానీ పార్టీగానీ చంద్రబాబు సామాజిక వర్గంతో నింపి అక్రమమార్గంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
పరిపాలనలో కీలక అధికారులంతా చంద్రబాబు మనుషులే ఉన్నారని, పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఇంటెలి జెన్స్ చీఫ్ వరకు అంతా ఆయన మనుషులేనన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్‌ని పర్యవేక్షించేందుకు ఓ డీఐజీ పోస్టును సృష్టించి, చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాసరావుకి ఆ పోస్టును కట్టబెట్టారని ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments