అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

ఠాగూర్
మంగళవారం, 21 మే 2024 (18:42 IST)
అమలాపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కడుపు నుంచి వైద్యులు ఏకంగా 570 రాళ్లు తొలగించారు. ఈ రాళ్లను చూసిన  వైద్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ అపరేషన్ అమలాపురం ఏఎస్ఏ ఆస్పత్రిలో చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఇటీవల ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేసి మహిళ కడుపులో నుంచి 570 రాళ్లను తొలగించారు. ఈ అరుదైన ఆపరేషన్‌ను అమలాపురంలోని ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన ఆపరేషన్ చేయగా, ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటుంది. 
 
ఈ అరుదైన ఆపరేషన్ వివరాలను ఏఎస్ఏ ఆస్పత్రి వైద్యులు మీడియాతో మాట్లాడుతూ, కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన జాలెం నరసవేణి (31) అనే మహిళ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. భోజనం చేశాక నొప్పి ఎక్కువగా అవుతుండటంతో భరించలేక వైద్యులను ఆశ్రయించింది. దేవగుప్తం ఆస్పత్రిలో చూపించుకోగా, అక్కడి వైద్యులు అమలాపురంలోని ఏఎస్ఏ ఆస్పత్రి రిఫర్ చేశారు. నరసవేణిని పరీక్షించిన ఏఎస్ఏ వైద్యులు స్కానింగ్‌లో గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్‌ చేసి వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. డాక్టర్ నర్రా శ్రీనివాసులు, డాక్టర్ అంజలి నేతృత్వంలోని ఈ నెల 18వ తేదీన అరుదైన ఆపరేషన్ నిర్వహించి పేషెంట్ నరసవేణి గాల్ బ్లాడర్‌‍ నుంచి 570 రాళ్ళను వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments