Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపురం అల్లర్లు : కీలక నిందితుడు అన్యం సాయి అరెస్టు

Webdunia
బుధవారం, 25 మే 2022 (19:20 IST)
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరిగిన హింసాత్మక ఘటనలో కీలక నిందితుడుగా భావిస్తున్న అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై విచారిస్తున్నారు. 
 
కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏపీ ప్రభుత్వం పేరు మార్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు, అంబేద్కర్ పేరు కొనసాగించాలని మరికొందరు పోటాపోటీగా ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి అల్లర్లకు దారితీశాయి. రాష్ట్ర మంత్రి విశ్వరూపం, ఎమ్మెల్యే సతీష్ గృహాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. 
 
ఈ అల్లర్లకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వీరిలో అన్యం సాయి ప్రధాన నిందితుడుగా భావిస్తున్నారు. ఈయన అధికార వైకాపాకు చెందిన నేతలగా భావిస్తున్నారు. 
 
జిల్లా పేరును మారిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చొక్కా విప్పేసి కిరోసిన్ క్యాన్ చేతబట్టిన సాయి వీడియోలు ప్రస్తుతం న్యూస్ చానెళ్ళలో వైరల్‌గా మారాయి. ఆరంభం నుంచి జిల్లా పేరును మార్చొద్దంటూ సాగుతున్న ఆందోళనలో సాయి కీలకంగా వ్యవహిరిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments