Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్తంభించిన ఇన్‌స్టాగ్రామ్ సేవలు - యూజర్ల తీవ్ర అసౌకర్యం

Advertiesment
instagram
, బుధవారం, 25 మే 2022 (16:06 IST)
ఇన్‌స్టాగ్రామ్ సేవలు బుధవారం స్తంభించాయి. మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్ సేవలు స్తంభించిపోవడంతో యూజర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిజానికి గత రెండు రోజులుగా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితి బుధవారం కూడా తలెత్తింది. 
 
దీంతో డెస్క్ టాప్, మొబైల్ వెర్షన్ ఇన్‌స్టా సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా అనేక మంది యూజర్లు తమ తమ ఖాతాల్లోకి లాగిన్ కాలేక పోయారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పని చేయడం లేదని అనేక మంది యూజర్లు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్: ‘‘కోనసీమలో గొడవలు జరగాలనే వైసీపీ కోరుకుంది’’