మన్యం ప్రాంతంలో ఓ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని హత్య దాని నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే అమలాపురంలో అగ్గిరాజేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కోనసీమ జిల్లా పేరు మార్పుతో అమలాపురంలో జరిగిన హింసాత్మక సంఘటనలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
మూడు రోజుల క్రితం సాక్షాత్ వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఒత కారు మాజీ డ్రైవర్, దళితుడైన సుబ్రహ్మణ్యంను చంపి, వాళ్ళ ఇంటికే వెళ్లి మృతదేహాన్ని అప్పగిస్తారా? మృతుడు ఎస్సీ వ్యక్తి కావడంతో తీవ్రమైన వ్యతిరేక వచ్చిందన్నారు. దీని నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ గొడవుల రేపారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడంలో సీఎం జగన్ బహు నేర్పరి అని, అమలాపురం విధ్వంసంలో కీలకంగా వ్యవహరించిన అన్యం సాయి వైకాపా నేతే.
వాస్తవాలు స్పష్టంగా ఉంటే హోం మంత్రి తానేటి వనిత మాత్రం తమపై నిందలు వేసేందుకు అమితమైన ఆసక్తి చూపుతున్నారని మండిపడ్డారు. కోనసీమకే పేరు పెట్టడం వెనుక ప్రభుత్వ ఆలోచన ఏమిటి? కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చు కదా? కులాల మధ్య చిచ్చురేపి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చడమే ఏపీ సీఎం జగన్ ముఖ్యోద్దేశమని ఆయన ఆరోపించారు. ఇలాంటి కుయుక్తుల ఉచ్చులో పడొద్దని యువతకు పవన్ మనవి చేశారు.