ఏపీలో ప్రధాని మోడీ.. లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు

వరుణ్
మంగళవారం, 16 జనవరి 2024 (15:46 IST)
ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన లేపాక్షి ఆలయానికి వెళ్లి, అక్కడ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులు ప్రధానికి వివరించారు.
 
ఆ తర్వాత, గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం వద్ద రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్‌)ని నిర్మించగా, దీన్ని ప్రధాని మోడీ ప్రధాని ప్రారంభించనున్నారు. 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. 
 
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడి నుంచి గంటలో చేరుకునేంత దూరం ఉండటం కలిసొచ్చే అంశం. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ తరహాలో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments