Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హర్యానా వర్శిటీ ప్రొఫెసర్ 500 మందిని అలా వేధించాడట.. ప్రధానికి లేఖ

victim woman

సెల్వి

, మంగళవారం, 9 జనవరి 2024 (12:12 IST)
హర్యానా రాష్ట్రం సిర్సావిల్‌లోని సౌత్రీ దేవి లాల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థినుల్లో సుమారు 500 మంది విద్యార్థినులు, ప్రొఫెసర్‌పై లైంగిక ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, హర్యానా ముఖ్యమంత్రి మనోకర్ లాల్ కట్టార్, గవర్నర్ దత్తాత్రేయకు లేఖ రాశారు. 
 
ఆ లేఖలో, ప్రొఫెసర్ విద్యార్థినిని పిలిచి మాట్లాడినప్పుడు, వారిని లైంగికంగా హింసించేవారని తెలిపారు. చాలా కాలంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని.. ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
ఈ ఘటనపై దీనిపై పోలీస్ ఈఎస్పీ దీప్తి కార్క్ మాట్లాడుతూ, ప్రొఫెసర్‌పై విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీనికి ముందు జరిగిన విచారణలో ప్రొఫెసర్‌పై నేరారోపణలు లేవని.. ప్రస్తుత ఆరోపణలపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా రాజకీయ జీవితం అపుడే ముగిసిపోయింది.. కాంగ్రెస్ మాజీ ఎంపీ