Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా రాజకీయ జీవితం అపుడే ముగిసిపోయింది.. కాంగ్రెస్ మాజీ ఎంపీ

lagadapati rajagopal

ఠాగూర్

, మంగళవారం, 9 జనవరి 2024 (11:23 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తోనే తన రాజకీయ జీవితం ముగిసిపోయిందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన సోమవారం మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. త్వరలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ముగ్గురు ఎంపీలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ముగ్గురు మాజీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలు. అలాంటి వీరి ఒక చోట సమావేశం కావడంతో కొత్త సరికొత్త ఊహాగానాలకు తెరలేపింది. 
 
ఇదే అంశంపై లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తాను చెప్పానని... చెప్పినట్టుగానే 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని గుర్తుచేశారు. రాజమండ్రికి తాను ఎప్పుడు వచ్చినా ఉండవల్లిని, హర్షకుమార్‌లను కలుస్తుంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జాతీయ పార్టీల ప్రభావం ఏమీ ఉండదని... ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఉండవల్లి, హర్షకుమార్ ఏ పార్టీల తరపున పోటీ చేసినా వారికి తన మద్దతు ఉంటుందని లగడపాటి తెలిపారు. 
 
కాగా, గత 2014 సంవత్సరానికి ముందు ఈ ముగ్గురు రాజకీయ నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా పలు అంశాల్లో చక్రం తిప్పారు. ఏపీ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత ఈ ముగ్గురు నేతలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ యాక్టివ్ అవుతున్న తరుణంలో వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ నేతల ధనం-కండ బలంకు చెక్.. ఎన్నారైలపై టీడీపీ..?