మాల్దీవుల్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం చైనా ట్రాప్‌లో పడి, కొంత కాలంగా భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రధాని మోదీ "లక్షద్వీప్" పర్యటనతో సీన్ మొత్తం మారిపోయింది. లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోషూట్ తర్వాత ఈ దీవుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
లక్షద్వీప్‌ను సందర్శించిన భారత ప్రధాని మోదీ పర్యాటకులు ఇకపై మాల్దీవులకు బదులు లక్షద్వీప్‌ను ఎంచుకోవాలని చెప్పడం మాల్దీవులకు కంటగింపుగా మారడం.. ఆపై ఆ దేశ మంత్రుల అనుచిత వ్యాఖ్యలు వెరసి "బాయ్‌కాట్ మాల్దీవ్స్"కు దారితీసింది.
ఆత్మాభిమానం గల భారతీయులు మాల్దీవ్స్ ట్రిప్స్‌కు బైబై చెప్పేశారు. ఇకపై తమ డెస్టినేషన్ లక్షద్వీపేనని తేల్చి చెప్పారు. లక్షద్వీప్ చేరుకోవడం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా.. పర్యటన వర్త్ అనిపిస్తుందని, భూతల స్వర్గంలో అడుగుపెట్టినట్లు వుంటుంది.
లక్షద్వీప్‌కు వెళ్లొందుకు సెప్టెంబర్ నుంచి మార్చి అనువైన సమయం అని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. మార్చి నుంచి జూన్ మధ్య కూడా వెళ్లొచ్చు. కోచి నుంచి విమానంలో లక్షద్వీప్ వెళ్లాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది.
ఎలా వెళ్లాలి.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ కోచి నుంచి లక్షద్వీప్‌కు విమాన సర్వీసులు నడుపుతోంది. లక్షద్వీప్‌లోని అగట్టి ప్రాంతంలో ఎయిర్‌స్ట్రిప్ ఉంది.
అగట్టి నుంచి కవరత్తి, కద్మత్ లాంటి పర్యాటక ప్రాంతాలకు పడవల్లో వెళ్లవచ్చు. అనుమతి లేకుండా లక్షద్వీప్‌కు వెళ్లడం నేరం. లక్షద్వీప్ వెళ్లాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం లక్షద్వీప్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
లక్షద్వీప్‌లో పర్యటించేందుకు వివిధ టూరిస్ట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా 3 నుంచి 6 రోజులకు గాను ఈ ప్యాకేజీలు ఉంటాయి. మూడు రోజుల ప్యాకేజీ ఒక్కో వ్యక్తికి రూ. 23,000 నుంచి మొదలవువుతుంది.