Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ 14కు వాయిదా

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (12:09 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ 14కు వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై జగన్‌ తరపు న్యాయవాదులు 98 పేజీల కౌంటర్‌ను దాఖలు చేశారు. బెయిల్‌ షరతులను జగన్‌ ఎక్కడా ఉల్లంఘించలేదని, సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్‌ వాదనలో నిజం లేదన్నారు.

సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని, రఘురామరాజుకు ఈ కేసుతో సంబంధం లేదన్నారు. ఇలాంటి కేసుల్లో థర్డ్‌ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని ఈ సందర్భంగా న్యాయవాదులు గుర్తుచేశారు.
 
రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకుపాల్పడ్డారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‌కు లేఖ కూడా రాశారని జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. రఘురామపై ఏపీలో అనేక కేసులున్నాయన్నారు. ఆచంట, నర్సాపురం, పెనుగొండ, పెనుమంట్ర, భీమవరం పోలీస్ స్టేషన్‌లలో కేసులున్నాయని తెలిపారు.

ఆయన బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టడంతో సీబీఐ కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాలను పిటిషనర్‌ కోర్టు ముందు దాచారన్నారు. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నారని అన్నారు. 
 
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే జగన్, సీబీఐ మూడు సార్లు గడువు కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామంటూ గత నెల 26న సీబీఐ కోర్ట్ హెచ్చరించింది.

ఈ క్రమంలో జగన్ తరఫు న్యాయవాదులు ఇవాళ కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు సంబంధించి సీబీఐ కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments