Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇషా రెబ్బావా? ఐతే మాకేంటి? ఈసారి కార్డు తీసుకుని వస్తేనే శ్రీవారి దర్శనం...

ఇషా రెబ్బా ఎవరబ్బా అని ఆశ్చర్యపోకండి. అంతకు ముందు ఆ తరువాత, అమీ తుమీ సినిమాల్లో నటించింది ఇషా రెబ్బా. తిరుమల శ్రీవారి దర్శనార్థం తొలిసారి వచ్చిన ఈ హీరోయిన్‌కు తీవ్ర అవమానమే జరిగింది. సినీ నటులందరికీ ఫిల్మ్ అసోసియేషన్ తరుపున ఐడెంటీ కార్డు ఇస్తారు. ఆ ఐ

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (15:03 IST)
ఇషా రెబ్బా ఎవరబ్బా అని ఆశ్చర్యపోకండి. అంతకు ముందు ఆ తరువాత, అమీ తుమీ సినిమాల్లో నటించింది ఇషా రెబ్బా. తిరుమల శ్రీవారి దర్శనార్థం తొలిసారి వచ్చిన ఈ హీరోయిన్‌కు తీవ్ర అవమానమే జరిగింది. సినీ నటులందరికీ ఫిల్మ్ అసోసియేషన్ తరుపున ఐడెంటీ కార్డు ఇస్తారు. ఆ ఐడెంటీ కార్డును జిరాక్స్ తీసుకుని తిరుమలలోని జెఈఓ కార్యాలయంలో దర్శనం కోసం ధరఖాస్తు చేసుకోవాలి. కానీ ఇషా రెబ్బాకు ఆ ఐడీ కార్డు లేదు. కేవలం ఆధార్ కార్డు మాత్రమే ఉంది. 
 
సెల్ఫ్ పేరుతో ఆమె ఒక్కరే దర్శనానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టిటిడి ఆమె లెటర్‌ను పక్కన పడేసింది. దర్సనానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఏం చేయాలో పాలుపోక కొంతమంది టిటిడి ఉద్యోగుల సలహాతో చివరకు ఇషా రెబ్బా స్వయంగా జెఈఓ శ్రీనివాసరాజుకు ఫోన్ చేసి తనకు ఇంకా ఫిల్మ్ అసోసియేషన్ నుంచి ఐడీ కార్డు రాలేదని, తాను తిరుమలలో ఉన్నానని, దర్శనానికి అనుమతినివ్వాలని కోరింది. దీంతో జెఈఓ ఆమె గురించి తెలుసుకుని ఆ తరువాత దర్శనానికి అనుమతించారు. మరోసారి ఐడీ కార్డుతో వస్తేనే తిరుమల శ్రీవారి దర్శనానికి పంపిస్తామని తేల్చి చెప్పారు తిరుమల జెఈఓ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments