Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు కాకుంటే 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు.. మీకొచ్చిన నొప్పేంటి : నటుడు సుమన్ (Video)

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (19:58 IST)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మూడు కాకుంటే 30 పెళ్ళిళ్లు చేసుకుంటారని మీకు కలిగిన నొప్పి ఏంటని సీనియర్ నటుడు సుమన్ సూటిగా ప్రశ్నించారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అనే టీవీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంటి బాధ?, మూడు కాదు.. ముప్పై కూడా అవ్వొచ్చు నీకేంటి నొప్పి? సినిమా ఎపుడు సినిమా వాడికే మద్దతు ఇస్తుంది.. నేనూ అంతే.. పవన్ కళ్యాణ్‌కే మద్దతు ఇస్తాను అని ఆయన వెల్లడించారు. 
 
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశం తీవ్ర ప్రభావం చూపించిన విషయం తెల్సిందే. గత వైకాపా పాలకులతో పాటు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ అంశాన్ని పదేపదే లేవనెత్తారు. ఏ ఎన్నికల సమావేశంలోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పవన్ మూడు పెళ్లిళ్ళ అంశాన్ని ప్రధానంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. వైకాపా నేతలంతా పవన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడంతో సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. 
 
2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ ప్రచారానికి వెళ్లి బోల్తాపడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత 151 అంకెల్లో ఐదు మాయం కావడంతో కేవలం 11 సీట్లకే పరిమితమై, చివరకు ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయారు. ఇపుడు ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ భీష్మించి కూర్చొని, అసెంబ్లీ సమావేశాలకు కూడా డుమ్మా కొడుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments