Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసెంబ్లీ మీద అలగడానికో.. మైక్ ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు గెలిపించింది.. వైఎస్ షర్మిల

ys sharmila

ఠాగూర్

, సోమవారం, 11 నవంబరు 2024 (12:14 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు జగన్‌తో పాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆమె సోమవారం ఓ ట్వీట్ చేశారు. 
 
అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు ఉందన్నారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది? అని అన్నారు. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది? మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే... ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికారపక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశమన్నారు. 
 
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదనీ, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నరు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టు షాపుల దందాను అరికట్టలేదు. ఐదు నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైకాపాకి ప్రజలు ఇస్తే... ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటంటూ మండిపడ్డారు. 
 
ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరమన్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదు. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. 
 
నియంత ప్రధాని నరేంద్ర మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారని గుర్తుచేశారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారింది. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టీ అసెంబ్లీకి వెళ్ళండి. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే వైకాపా శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయండి. అప్పుడు ఇంట్లో కాదు.. ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి అంటూ మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు- పాఠశాల విద్య కోసం రూ.29,909 కోట్లు (video)