ప్రధాని మోడీ బ్యాగులనూ ఈసీ అధికారులు తనిఖీ చేయాలి : ఉద్ధవ్ ఠాక్రే (Video)

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (19:37 IST)
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతుండగా తన లగేజీ బ్యాగులను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారని, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర సీనియర్ నేతల బ్యాగులను కూడా తనిఖీ చేయాలని శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు యావత్మాల్‌కు ఆయన హెలికాఫ్టర్‌లో వెళ్లారు. ఆయన హెలికాఫ్టర్ దిగగానే ఈసీ అధికారులు ఆయన హెలికాఫ్టర్‌తో పాటు లగేజీని కూడా తనిఖీ చేశారు. 
 
దీనిపై ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర సీనియర్‌ నేతల బ్యాగులనూ ఎన్నికల అధికారులు చెక్‌ చేయాలన్నారు. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని యావత్మాల్‌లోని వనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షేర్‌ చేసుకున్నారు. హెలికాప్టర్‌లో వనీకి చేరుకోగా.. కొందరు ఎన్నికల అధికారులు వచ్చి తన బ్యాగ్‌ను తనిఖీ చేశారని ఉద్ధవ్‌ తెలిపారు. బ్యాగ్‌ను తనిఖీ చేయడంపై మండిపడిన ఆయన.. అధికారుల జేబులు, గుర్తింపు కార్డుల్ని తమ పార్టీ కార్యకర్తలు, ఓటర్లూ తనిఖీ చేయాలన్నారు. 
 
ఎన్నికల అధికారులతో తనకు కోపం లేదన్న ఆయన.. 'మీరు మీ బాధ్యతలను అనుసరిస్తున్నారు. నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నా. నా బ్యాగును తనిఖీ చేసినట్లే.. ప్రధాని మోడీ, అమిత్ షా బ్యాగులను చెక్‌ చేశారా? సీఎం ఏక్‌నాథ్‌ శిండే, డిప్యూటీ సీఎంలు అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌ బ్యాగుల్ని తనిఖీ చేశారా? ఇలాంటి పనికిరాని పనులన్నీ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దీన్ని ప్రజాస్వామ్యంగా పరిగణించలేను. ఇది ప్రజాస్వామ్యం కాదు.  ప్రజాస్వామ్యంలో చిన్నా, పెద్ద అనేది ఉండదు' అన్నారు.
 
ఎన్నికల అధికారులు అధికార కూటమి సీనియర్‌ నేతల బ్యాగులను తనిఖీ చేయకపోతే.. శివసేన (యూబీటీ) కార్యకర్తలు, విపక్ష కూటమి శ్రేణులే వారిని తనిఖీ చేస్తాయన్నారు.  ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు వారి బ్యాగులను తనిఖీ చేసే హక్కు ఓటర్లకు ఉన్నందున పోలీసులు, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోరాదన్నారు. మరోవైపు, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే బ్యాగును అధికారులు తనిఖీ చేస్తున్న వీడియోను శివసేన (యూబీటీ) తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసింది. అధికారులు బ్యాగును తనిఖీ చేస్తుండగా..  ఇతర నేతల బ్యాగుల్ని సైతం ఇలాగే తనిఖీ చేశారా?అని ఉద్ధవ్‌ ఠాక్రే అధికారుల్ని ప్రశ్నించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

Arnold Schwarzenegger: వేటలో చిక్కుకున్న వేటగాడు కథతో ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments